ELR: 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఏలూరు పడమర వీధి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవార్ల మేడల వద్ద శ్రీ సరస్వతి దేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. పిల్లలందరూ సాయంకాలం పుస్తకం, పెన్నులు తెచ్చుకుంటే అమ్మవారి పూజలో పెట్టి ఇస్తారని జాతర కమిటీ సభ్యులు తెలిపారు. విద్యాబుద్ధులకు ఆది దేవత సరస్వతి దేవిని దర్శించుకుని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలన్నారు.