PLD: శావల్యాపురం( M) చెందిన కోటయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందగా, కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతిరావు సమన్వయంతో ఐ బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించారు. ఐ బ్యాంక్ సిబ్బంది కోటయ్య కంటి కార్నియాలను సేకరించారు. నేత్రదానం ద్వారా మరొకరికి చూపునివ్వడం అభినందనీయమని చలపతిరావు పేర్కొన్నారు.