KRNL: జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన కృషి మరువలేనిదని మంత్రి కొనియాడారు.