NDL: జిల్లాలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి కలిసి పర్యటించినట్లు తెలిపారు. శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం అన్ని వసతులతో కూడిన త్రీస్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీశైలంలో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.