PPM: సభ్య సమాజం సిగ్గుపడేలా మాజీ మంత్రి, YCP నేత ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి TDP ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని పార్వతీపురం MPP మజ్జి శోభారాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. యావత్ మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు.