PLD: కారంపూడిలో ఇవాళ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీలోని మురుగు కాలువలో రోజుల వయసున్న పసికందు మృతదేహం లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. కన్నపేగును ఇలా కాలువలో పడేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని బయటకు తీసి స్థానికులే అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం మచ్చపడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.