ఏలూరు వన్ టౌన్ జేపీ కాలనీలో నూతన క్రిమినల్ చట్టాలపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా భద్రత, సైబర్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను సీఐ వివరించారు.