కడప రిమ్స్ ఆసుపత్రి పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉద్యోగాల నియామకానికి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.జమున పేర్కొన్నారు. ఎంపికైన వారి జాబితా జిల్లా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఎంపికైన వారు ఈ నెల 26వ తేదీన సర్టిఫికెట్లతో రిమ్స్ మెడికల్ కళాశాలకు ఉ.10:30 గంటలకు హాజరుకావాలని ఆమె కోరారు.