E.G: సీఎం చంద్రబాబుకు టీడీపీ లీగల్ సెల్ కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం రాజమండ్రిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్, నగర అధ్యక్షుడు కొమర్తి బాబ్జి మాట్లాడారు. మరణించిన ప్రతి న్యాయవాది కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున 1150 మంది కుటుంబాలకు రూ. 46 కోట్లు విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.