NLR: మెడికల్ కళాశాలల ప్రైవేటికరణను నిరసిస్తూ ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్నారు. ప్రజల మద్దతుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.