KRNL: వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ సిలిండర్ బిల్లులో పేర్కొన్న ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గోవింద రావు స్పష్టం చేశారు. దీపం-2 పథకం అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలనలో భాగంగా శుక్రవారం పెద్దకడుబూరులో పర్యటించారు. ప్రజాభిప్రాయ సేకరణలో పనితీరు వెనుకబడినట్లు ఆయన గుర్తించారు.