VZM: గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో నిన్న రాత్రి గంట్యాడ మండలం లక్కిడాంలో వైసీపీ నాయకులు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు నియామకంతో పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.