KDP: వేముల మండలంలో రబీ సీజన్లో సాగు చేసిన శనగ పంటకు తెగుళ్ల నివారణకు రైతులు మందులు పిచికారి చేస్తున్నారు. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడులు బాగుంటాయని రైతులు ఆశిస్తున్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయని, అధిక దిగుబడులతో పాటు గిట్టుబాటు ధర లభిస్తే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు.