GNTR: మామిళ్ళపల్లి మొక్కజొన్నల వివాదానికి వైసీపీ కావాలనే కుల రంగు పులుముతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడితే మంచిదే కానీ, కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు అంగీకరించరని హెచ్చరించారు. ప్రస్తుతం పొన్నూరు ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.