E.G: ప్రభుత్వం నిర్వహించిన కౌశల్ ప్రతిభా పరీక్షకు తూ.గో జిల్లా స్థాయిలో నిడదవోలు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. క్విజ్ విభాగంలో ఏ.జస్సిక, పోస్టర్ విభాగంలో ఏ. హన్సిక ప్రతిభ కనబరిచారని ప్రధాన ఉపాధ్యాయులు ఎన్. అరుణ రాజేశ్వరి ఇవాళ తెలిపారు. వీరు డిసెంబర్ 27న తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయిలో పాల్గొంటారన్నారు.