కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.