కర్నూలు జిల్లాలో ‘పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL’ కలుపు మందు విక్రయాలపై 60 రోజుల నిషేధం విధించినట్లు ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఉన్న సుమారు 8,950 లీటర్ల అమ్మకాల నిలుపుదలకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేడీ హెచ్చరించారు.