ATP: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చారు. ప్రజావేదికలో నియోజకవర్గ గ్రామ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడారు. సీనియర్లను గుర్తించి త్వరలో పదవులు ఇస్తామన్నారు. ఈ మేరకు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.