W.G: తణుకు నియోజకవర్గంలో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.