GNTR: చిన్నకాకాని సమీపంలో ఆదివారం సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి మణికట్టుపై ‘సాయి’ అనే పేరు, శివుని డమరుకం, త్రిశూలం పచ్చబొట్లు ఉన్నాయి. వడదెబ్బ లేదా ఫిట్స్ కారణంగా ఆమె చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.