ATP: గుంతకల్లు పట్టణంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు భీభత్సం సృష్టిం చాయి. కొన్ని కాలనీల్లో గంటపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. శివారు కాలనీల్లో పలు చెట్లు నేలకొరిగాయి.