అన్నమయ్య: రాయచోటి కేంద్రంగా చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలోని 14 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రామచంద్ర డిమాండ్ చేశారు. రాయచోటి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా శిబిరాన్ని సందర్శించి బీటీఏ మద్దతు ప్రకటించింది. ప్రజల మనోభావాలను గౌరవించి వెంటనే నూతన జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.