కర్నూలు: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 10న జేఏసీ ఇచ్చిన బంద్‌కు టీడీపీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదోని నేతలు జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన అనంతరం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నేత ఉమాపతి నాయుడు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.