సత్యసాయి: జిల్లాలో అమలవుతున్న పునరుత్పాదక శక్తి పవర్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో భూసర్వేలు, అనుమతులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులు ఉపాధి పెంపు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు.