BPT: కొల్లూరులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ట్రైనీ ఎస్సై తులసి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. కొల్లూరులోని బ్రహ్మంగారి గుడి వద్ద కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులు, 5 మొబైల్స్, రూ.18,423ల నగదును స్వాధీనం చేసుకున్నారు.