సత్యసాయి: ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందజేశారు. రైతుల భూహక్కులకు పూర్తి భద్రతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ రికార్డుల పారదర్శకతతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.