ప్రకాశం: బెస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామం వద్ద అరటిపండ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అరటిపండ్లతో రోడ్డంతా చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాగా, పోలీసులు ఘటనపై పరిశీలన చేసి దర్యాప్తు ప్రారంభించారు.