VZM: జిల్లా పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబులుగా పని చేసి, అనారోగ్య కారణంగా మృతి చెందిన ఎ.గోవిందరావు కుటుంబానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ రూ.1,48,000 చెక్‌ను శుక్రవారం అందజేశారు. ఈ నిధిని జిల్లా పోలీసు శాఖ సిబ్బంది స్వచ్ఛందంగా అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో పోలీసు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.