KRNL: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కో కన్వీనర్‌గా కర్నూలుకు చెందిన తెలుగు అంబన్నను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగళి గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు అంబన్న మాట్లాడుతూ.. పార్టీ తనపై నమ్మకం ఉంచి తనకు పదవి ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.