TPT: తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శుక్రవారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ మేరకు వేద పాఠశాలలో ఏడాదికి ఒకసారి విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4 పంచెలు, ఒక దుప్పటి చొప్పున మొత్తం 380 మంది విద్యార్థులకు వస్త్రాలు అందజేశారు.