ప్రకాశం: కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని రెవెన్యూ, ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్లో ప్రజలు అర్జీలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని నియమించుకోవాలని కోరారు.