E.G: రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి.