ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు.