W.G: భీమవరం పట్టణంలోని 7 రేషన్ షాప్లపై 6A కేసులు నమోదు చేసినట్లు పౌరసరపురాల డీటీ సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పట్టణంలోని 21 రేషన్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 7 షాపుల్లో నిత్యవసర సరుకుల నిల్వలలో తేడాలు ఉన్నాయని, ఏడుగురు డీలర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.