W.G: తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు.