GNTR: మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి FBలో దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు శనివారం కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జేకేసీ రోడ్డుకు చెందిన ఓ మహిళ ఫొటోలను ప్రకాశం జిల్లా కృష్ణంశెట్టిపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మార్ఫింగ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.