KDP: పెండ్లిమర్రిలోని యల్లటూరు చారిత్రక చెన్నకేశవ స్వామి దేవస్థానాన్ని శుక్రవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, దేవస్థానంలో నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ రూమ్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త సౌకర్యాలు భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయని ఆయన తెలిపారు.