KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి ధరలు పడిపోయాయి. ఇవాళ క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 7,639 మాత్రమే పలికింది. కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉన్నా సీసీఐ కొనుగోళ్లు యాప్ సాంకేతిక సమస్యలతో నిలిచిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు మరుసటి రోజు రావాలని అధికారులు చెప్పడంతో మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.