అన్నమయ్య: పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో శ్రీ సంజీవరాయ స్వామి ఆలయంలో మగవారి పొంగళ్ల పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మగవారే ప్రత్యేక పూజలు చేసి పొంగళ్ళు పెట్టడం ఆలయ సంప్రదాయం. పండుగ రోజున మహిళలకు ఆలయ ప్రవేశం లేదు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఈ ఉత్సవాన్ని ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.