ASR: NDA ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు విపరీతంగా పెరిగాయని పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు ఆరోపించారు. సోమవారం ఆయన పాడేరులో మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ అని, నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దగా కోరు పరిపాలనపై చంద్రబాబును ప్రజలు ప్రశ్నించాలన్నారు.