ప్రకాశం: వెనుజులాపై అమెరికా అత్యంత దారుణమైన రీతిలో దాడులకు పాల్పడుతుందని వెంటనే ఆపాలని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని కోర్ట్ సెంటర్లో సీపీఐ, సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ… వెనుజులా అధ్యక్షుడు మధురోను అతని భార్యను కిడ్నాప్ చేసిన ఘటనపై భారత్ వైఖరి స్పష్టం చేయాలన్నారు.