పెనుకొండలో నిర్వహించిన శ్రీ సత్యసాయి జిల్లా “పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ 2026” కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతులకు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. “దేశం ముందున్న సవాళ్లు” అనే అంశంపై ఆయన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.