E.G: దేవిపట్నం మండలం పరగసానిపాడులో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ పోటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పరగసానిపాడు గ్రామానికి చెందిన రాజు అప్పటివరకు బ్యాటింగ్ చేసి అవుట్ కాగా మంచినీళ్లు త్రాగి విశ్రాంతి తీసుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు