VZM: బొబ్బిలి RTC కాంప్లెక్స్ వద్ద ఆదివారం బస్సు , లారీ ఢీకొన్న ఘటనలను పెను ప్రమాదం తప్పింది. స్దానికుల వివరాల ప్రకారం కాంప్లెక్స్ నుంచి విశాఖ వెళ్తున్న బస్సును అవుట్ గేట్ వద్ద రామభద్రపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న లారీ ఢీకొట్టింది. రెండు వాహనాలు నెమ్మదిగా వెళ్లడం వలన ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు