అన్నమయ్య: పీలేరులోని ఆర్టీసీ నల్లగుట్టలో ఓం శక్తి అమ్మవారి ఆలయ నిర్మాణంపై గురువారం రమాదేవి, రామకృష్ణ వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రమాదేవి వర్గం నిర్మాణ పనులు ప్రారంభించగా,రామకృష్ణ వర్గం అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగింది. సమాచారం అందుకున్న సీఐ యుగంధర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించడంతో వివాదం సద్దుమణిగింది.