KKD: పెదపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 9న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ‘ప్రజా దర్బార్’ నిర్వహించనున్నారు. మండల ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తమ సామాజిక, వ్యక్తిగత సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని ఎంపీడీవో నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.