KRNL: ఆదోని కొండల్లో 21 అడుగుల ఏకశిలా హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అరుదైన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలోని ఒంటె ఆకార వాహనంపై ఓ వానరం కూర్చోవడం ఇవాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు దీనిని ఆంజనేయ స్వామి కృపాకటాక్షంగా భావించి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అక్కడికి వచ్చిన వారు ఈ దృశ్యాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించారు.