CTR: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలోని వృద్ధాశ్రమానికి సీఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చ్ స్త్రీల మైత్రి తరపున సామాగ్రిని వితరణ చేశారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఆదివారం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. షర్లి నిమ్రోద్ యేసు ప్రేమ గురించి ఆశ్రమంలో వివరించారు. ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్, బియ్యం, పండ్లు మిఠాయిలను అందజేశారు.