కృష్ణా: ఆధ్యాత్మిక ప్రముఖుడు, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆదివారం ఉదయం ఘంటసాలలోని శ్రీ బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.