ATP: గుమ్మగట్ట మండలం గలగల గ్రామానికి చెందిన శివమ్మకు అత్యవసర వైద్య చికిత్సకోసం CMRF నుంచి రూ.3,50,400 ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ నిధులకు సంబంధించిన అనుమతి పత్రాన్ని (LOC) ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బాధిత కుటుంబానికి అందజేశారు. తిరుపతిలోని నిమ్స్ వైద్యుల సిఫారసు మేరకు నిధులు నేరుగా ఆసుపత్రికి విడుదల కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.